గాడ్ ఫాదర్‌తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. అదే జోష్‌తో మెగా 154(mega 154) ప్రాజెక్ట్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే అనుకున్న సమయానికి వాల్తేరు వీరయ్య వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ మెగా 154 రావడం పక్కా అంటున్నారు. అంతేకాదు డేట్ కూడా లాక్ చేసినట్టు టాక్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154.. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. దాంతో దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ లోపు ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా ఇలాంటి వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. జనవరి 12న ఆదిపురుష్ రిలీజ్ అవుతుండడంతో.. మెగా 154ను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే దాదాపుగా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అలాగే మరో మూడు పాటలు షూట్ చేయాల్సి వుందట. వీలైనంత త్వరగా ఈ బ్యాలెన్స్ షూట్‌ని కూడా ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.