నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో కలిసి దేశాన్ని అస్థిర పరిచేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జమ్మూకశ్మీర్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర, అసోంలోని 9 ప్రాంతాల్లో నేడు ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో బ్యాంకింగ్ రికార్డులు, డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.