TG: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టూటౌన్ పీఎస్లో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ తాతా మధు పార్టీ కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు. పరిపాలన చేతకాక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న మద్దతు ధర ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు.