భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్లో వ్యాపారవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ నా దృష్టిలో AI అంటే అమెరికా, ఇండియా. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అభివృద్ధి.. ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు భరోసా ఇస్తుంది. వికసిత్ భారత్ వైపు మేము చేసే ప్రయాణానికి మూల స్తంభం సాంకేతికత’ అని తెలిపారు.