AP: నేటి ఆధునిక కాలంలో పిల్లలకు పేర్లు పెట్టాలంటే తల్లిదండ్రులు ట్రెండీగా ఉండే విధంగా సెర్చ్ చేస్తారు. కానీ, అనంతపురం(D) తాడిపత్రికి చెందిన సీహెచ్ రాఘవేంద్ర తన కుమారుడికి వినూత్నంగా పేరు పెట్టారు. కుల, మత ప్రస్తావన లేకుండా ‘సీహెచ్ వన్ టూ సిక్స్’ అని నామకరణం చేశాడు. వన్ అంటే I, టూ అంటే AM, సిక్స్ అంటే INDIAN.. ఐ యామ్ ఇండియన్ అనే అర్థం వచ్చేలా, మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.