AP: ప్రముఖ మృదంగ విద్వాంసుడు కమలాకరరావు(88) కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈయన చిన్ననాటి నుంచే మృదంగాన్ని నేర్చుకుని అనతికాలంలోనే దేశవ్యాప్తంగా కీర్తిగడించారు. కళాశాల విద్యార్థిగా ఉండగానే అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్‌ను అందుకున్నారు. దేశవిదేశాల్లో శాస్త్రీయ సంగీత సభల్లో శ్రోతలను మైమరిపించారు.