TG: సీఎం రేవంత్ రాష్ట్రంలో రాబందులా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి KTR అన్నారు. లగచర్ల ఘటనలో అరెస్టైన 16 మందితో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖత్ అనంతరం మాట్లాడారు. ‘గతంలో ఫార్మా కంపెనీలను వ్యతిరేకించిన రేవంత్.. ఇప్పుడు భూములు కావాలంటున్నారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని, వేరేచోట ITI చదువుకున్న విద్యార్థిని కూడా అరెస్ట్ చేశారు. సీఎం అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు’ అని మండిపడ్డారు.