AP: విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం సమక్షంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ప్రజల కోసమే పని చేయాలనే సంకల్పంతో పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. కష్టాల కొలిమిలో నడుస్తూనే ఏపీకి అండగా ఉండాలని పోరాటం చేశానని చెప్పారు. జనసేన నిర్మాణానికి దాదాపు దశాబ్ద కాలం పట్టిందన్నారు. ప్రజల కోసం మనమంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.