డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ తింటే 60 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం. దీన్ని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ జర్వం తగ్గుతుంది. ఈ పండు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వయస్సు మీద పడే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.