AP: సీఎం చంద్రబాబు తండ్రిని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మంత్రి పార్థసారథి విమర్శించారు. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

