AP: విజయవాడలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు దుర్గమ్మ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గాయత్రి దేవిని వేదమాతగా, జ్ఞానానికి అధిష్టాన దేవతగా భక్తులు నమ్ముతారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికసించి, సన్మార్గంలో నడిచే శక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రత్యేకమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు.