MIM పార్టీ అధినేత ఓవైసీ రజాకార్ల వారసుడని.. వారు మరఠ్వాడా ప్రజలను హింసించారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ‘ఓటు జిహాద్’ మొదలైందని.. దాన్ని ‘ఓటు ధర్మయుద్ధం’తో ఎదుర్కోవాలన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ స్పందిస్తూ.. తమ పూర్వీకులు బ్రిటీషు పాలకులపై జిహాద్ చేస్తున్నప్పుడు.. ఫడ్నవీస్ పూర్వీకులు తెల్లదొరలకు ప్రేమలేఖలు రాసేవారని ఎద్దేవా చేశారు.