ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కండరాలు, చర్మం, అవయవాల నిర్మాణానికి ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. మినపప్పు, ఇడ్లీ రవ్వ, బియ్యం రవ్వతో చేసే ఇడ్లీలు తేలికగా జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి. చట్నీ, సాంబర్తో కలిపి రెండు ఇడ్లీలను తింటే 300 కేలరీలతోపాటు ప్రోటీన్ కూడా లభిస్తుంది.