TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించనున్నారు. MLAలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్ణయం ప్రకటించనున్నారు. మొత్తం 10 పిటిషన్లలో ఇప్పటికే 5 పరిష్కారం కాగా, MLA సంజయ్ కుమార్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉంది. దానం, కడియంలపై విచారణ ఇంకా పూర్తి కాలేదు.