తమ దేశంలో అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు US ప్రభుత్వం చేపట్టిన భారీ బహిష్కరణ కార్యక్రమంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలసదారుల అణచివేతకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాదని పోప్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికా బిషప్లకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ట్రంప్ యంత్రాంగం ‘స్వాభావిక గౌరవాన్ని’ దెబ్బతీస్తుందని పోప్ విమర్శించారు.