Akp: ఈ నెల 25లోగా రైతులు తమ భూముల వివరాలను ఆన్ లైన్లో రిజిస్టర్ చేయించుకోవాలని రోలుగుంట మండల వ్యవసాయాధికారి ఎస్.విజయలక్ష్మి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్ లైన్లో రిజిస్టర్ చేస్తారన్నారు.