TG: కాంగ్రెస్ సర్కార్‌పై BRS కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ MP మల్లురవి ఆరోపించారు. కొడంగల్‌లో భూసేకరణపై కలెక్టర్ ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లారని, BRS నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. దాడి విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతోనే ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని.. ప్రజలే BRS నేతకు సరైన గుణపాఠం చెబుతారని వెల్లడించారు.