దేశంలోని ప్రముఖ టైర్ల తయారీ సంస్థలు మరోసారి టైర్ల ధరలను పెంచనున్నాయి. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి గత రెండు త్రైమాసికాలుగా ఇదే ధోరణిని అనుసరిస్తున్న కంపెనీలు మరోసారి పెంచక తప్పడంలేదని వాపోతున్నాయి. సహజంగా లభించే రబ్బరు ఖర్చులు నిరంతరం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కాగా.. ఇటీవలే తమ ప్యాసింజర్, కమర్షియల్ టైర్ల ధరలను 3 నుంచి 4 శాతం పెంచామని CEAT పేర్కొంది.