TG: BJP నేతలు ఎన్నికల్లో దేవుడి పేరు.. కులం, మతం పేరుతో ఓట్లు అడుగుతారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తర్వాత హిందూ, ముస్లిం గొడవలు పెడతారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. తాము హనుమంతుడు, శ్రీరాముడి భక్తులమేనని.. కానీ దేవుడి పేరుతో ఓట్లు అడగమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని అన్నారు.