WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో సోమవారం చేపట్టిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి సీతక్క, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా పాదయాత్రకు రాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రజాప్రతినిధుల గైర్హాజరీపై చర్చ జరుగుతోంది.