AP: ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై ఆమె స్పందించారు. రాష్ట్రంలో హిట్లర్, గడాఫీల పాలన సాగుతుందన్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నప్పటికీ.. స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.