TG: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి విశ్రాంత కార్మికులకు రూ.18.27 కోట్ల దీపావళి బోనస్‌ను అందించనుంది. ఈ నెల 27న వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని సీఎండీ ఎన్.బలరాం వెల్లడించారు. 2024 ఏప్రిల్ నుంచి గత నెల 24 వరకూ పనిచేసి రిటైరైన 2,754 మంది కార్మికులకు సంబంధించిన దీపావళి బోనస్ సొమ్మును విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,750 చొప్పున వస్తుందని వెల్లడించారు.