సత్యసాయి: టీడీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నేకొత్తపల్లి మండల టీడీపీ నాయకులతో మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే రాప్తాడు నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రథమ స్థానంలో ఉండేలా ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు.