TG: HYDలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన జానపద జాతర ‘లోక్ మంథన్’ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల సంస్కృతులు, సంగీత వాయిద్యాలు, తాళపత్రాలను ఇక్కడ ఉంచారు. ఈ నెల 21న ప్రారంభమైన సమావేశాలు ఈరోజు మ.2 గంటలకు RSS చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగాలతో ముగుస్తున్నాయి.