KMM: జిల్లాలో ఆదివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. గట్టయ్యసెంటర్ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించే కుమ్మర, ఆర్యవైశ్య, బంజారాల కార్తీక వన సమరాధన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.