ATP: గార్లదిన్నె(మం) తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాద ఘటన చాలా బాధాకరమని మంత్రి సవిత బాధాకారం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను పరిశీలించారు.