KRNL: ఆదోని మార్కెట్ యార్డులో వచ్చే నెల 1 నుంచి వేరుశనగకాయల పాసింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు యార్డు సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రైతులు, ప్రజా సంఘాల నుంచి ఈ విధానాన్ని తొలగించాలని వినతులు వచ్చాయన్నారు. ఇటీవల సబ్ కలెక్టర్, ఆదోని ఎమ్మెల్యే మార్కెట్ యార్డును సందర్శించి సమస్యపై చర్చించారన్నారు.