TG: BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లగా.. మార్షల్స్ ఆయన్ని అడ్డుకున్నారు. సమావేశాలకు రావద్దని సూచించారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని MLA జగదీశ్ డిమాండ్ చేశారు. తాను సభకు హాజరుకావొద్దని రాతపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. కాగా.. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్ రెడ్డి సభ నుంచి సస్పెండైన విషయం తెలిసిందే.