ఔషధ గుణాలున్న తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. సీజన్ మారినప్పుడు రకరకాల వ్యాధులు చుట్టుముడతాయి. శీతాకాలంలో జలుబు, దగ్గు, తలనొప్పి, చర్మ సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటికి తేనెతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గుకి మందులా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవు. పాలలో కాస్త తేనె కలిపి మాయిశ్చరైజర్లా వాడుకోవచ్చు.