ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మన్మోహన్ సింగ్… ఆపరేషన్ అనంతరం దేశం గురించే ప్రశ్నించారట. 2009లో 10 గంటల శస్త్ర చికిత్స అనంతరం.. స్పృహలోకి వచ్చిన మన్మోహన్.. దేశం ఎలా ఉంది? కాశ్మీర్ ఎలా ఉంది? అని ప్రశ్నించారట. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స అందించిన వైద్యుడు తెలిపారు.