అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటలీ వెనిస్ నగరంలోని సముద్ర తీరంలో బెజోస్‌కు చెందిన 500 మిలియన్ డాలర్ల విలాస నౌకలో జూన్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు తెలుస్తోంది.