AP: మాజీమంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. ‘మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలు ఆపడం లేదు. కొందరు అధికారులు, ఎమ్మెల్యేలే దీనికి సాక్ష్యం. జిల్లా కోర్టులో నా భార్య బెయిల్ కోసం అప్లై చేసింది. బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా ప్రయత్నాలు చేశారు’ అని పేర్కొన్నారు.