AP: మాజీ CM జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖలో భారీ అక్రమాలు జరిగినట్లు పోలీసులకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కనుపూరు కాలువ పనుల్లో రూ.100 కోట్లు.. PDR నిధుల్లో రూ.200 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ మౌఖిక ఆదేశాలతోనే అప్పటి SE కృష్ణమోహన్, అధికారులు అక్రమాలకు తెరలేపారని ఫిర్యాదులో పేర్కొన్నారు.