AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని వల్ల రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది ఏర్పడిన తర్వాత 36 గంటల్లో.. పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక వైపు వెళ్తోందని ఐఎండీ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.