TG: రాష్ట్రంలో ఖాళీ అయిన MLA కోటా MLC పదవుల్లో ఓ స్థానానికి పార్టీ అధిష్టానం సామరామ్మోహన్ రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ రాజకీయాలకు అతీతంగా యువ నేతలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, పార్టీ పెద్దలతో MLC అభ్యర్థుల పేర్ల ఖరారుపై చర్చించేందుకు CM రేవంత్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటు సామరామ్మోహన్ కూడా ఢిల్లీకి వెళ్లారు.