తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్టినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దేశంలో బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం వేదికగా జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్తో 2024 రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే వారి పక్షాన ప్రజలు నిలబడతారనేది కేసీఆర్ నమ్మిన సిద్ధాంతమని వెల్లడించారు.
ప్రజా సంక్షేమం విషయంలో పేద ప్రజల స్థితిని, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చడానికి సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని, ఆయన్ని దేశం ప్రగాఢంగా విశ్వసిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ఎజెండాను వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు, బీఆర్ఎస్ ఆవశ్యకతను ఆన్లైన్లో వివరించి చైతన్యం తీసుకొస్తామని తెలిపారు.