AP: రాజ్యాంగానికి మాజీ సీఎం జగన్ గౌరవం ఇవ్వడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికార పక్షం చేసే తప్పులను సరిచేయడం విపక్ష పార్టీల పని అని తెలిపారు. జగన్ అసెంబ్లీకి రామనడం వింతగా ఉందన్నారు. గతంలో వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. తాము చివరి వరకు అసెంబ్లీలో పోరాటం చేశామని గుర్తుచేశారు. సభకు రానంటున్న జగన్.. ఎమ్మెల్యే పదవికీ అనర్హుడని విమర్శించారు. అసెంబ్లీకి రామంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని తేల్చి చెప్పారు.