కర్ణాటకలో BJP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ‘కొవిడ్-19 స్కాం’ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైకోర్టు రిటైర్డ్ జడ్జి మైఖేల్ డీ కున్హ సారథ్యంలోని దర్యాప్తు కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నాడు CMగా ఉన్న BS యడియూరప్పను, అప్పటి మంత్రి శ్రీరాములును విచారించాలని దర్యాప్తు కమిషన్ సిఫారసు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద ప్రశ్నించాలని కాంగ్రెస్ సర్కారుకు సూచించింది.