AP: శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై MLC బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బెల్టు షాపులపై కేసులు తగ్గాయంటే అక్రమాలు తగ్గాయని అర్థమా? YCP ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా అవే బ్రాండ్స్ అమ్ముతున్నారు కదా? ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తివేసింది మీరు కాదా? చరిత్ర కాదు.. ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం మాట్లాడాలి’ అని అన్నారు.