ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ విఫలమైన తర్వాత అతని వైఖరిని అనుమానిస్తూ పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ట్రంప్ ఒకప్పుడు KGB గూఢచారి అని పేర్కొంటూ కథనాలు వచ్చాయి. అందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ను విమర్శించడం లేదని సందేహం వ్యక్తం చేశాయి. ఐరోపా మిత్రదేశాలను దూరం చేసుకోవడంపైనా భిన్న వ్యాఖ్యానాలు వ్యక్తం అవుతున్నాయి.