జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జొన్నలతో పోషకాహారం మాత్రమే కాదు.. అధికబరువుతో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి.