AP: మూఢనమ్మకంతో చిన్నారి చనిపోయిన ఘటన నెల్లూరులో జరిగింది. లక్ష్మయ్య, లక్ష్మి దంపతుల కూతురు భవ్యశ్రీ(8)కి బ్రెయిన్ ట్యూమర్. వైద్యులు సర్జరీ చేయాలని చెప్పగా.. అలా చేస్తే చిన్నారి బతకదని తల్లిదండ్రులు భయపడ్డారు. సర్జరీ చేసేంత డబ్బులు వారికి దగ్గర లేవు. ఈ క్రమంలో ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతోందని కొందరు చెప్పడంతో.. 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేశారు. దీంతో చిన్నారి చర్చిలోనే చనిపోయింది.