VSP: రౌడీషీటర్లు అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండాలని ఆరిలోవ సీఐ హెచ్.మల్లేశ్వరరావు సూచించారు. ఆదివారం ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్టేషన్ పరిధిలోని ఎండాడ, సాగర్‌నగర్, జోడుగుళ్లుపాలెం, డెయిరీపారం, ఆరిలోవ ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొడవలకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.