AP: అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజుపై సస్పెన్షన్ వేటుపడింది. రాష్ట్ర గవర్నర్ నజీర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ చర్యలు తీసుకున్నారు. విజయరాజును సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. మండలి ఛైర్మన్ ఛాంబర్‌పై కెమెరా తిప్పిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. అతనిపై ఎలాంటి రిమార్క్ లేదని విజయరాజు లేఖ రాయడంపై అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సీరియస్ అయినట్లు సమాచారం.