AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ల్యాబ్ రిపోర్టుల్లో అడ్డంగా దొరికిపోయినా బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రసాదం కల్తీ వెనుక భారీ కుట్ర కనిపిస్తోందని ఆరోపించారు. ఐదేళ్లూ అనేక దేవాలయాలపై దాడులకు తెగబడ్డారని.. ఇప్పుడు ఏకంగా ప్రసాదం కల్తీ బండారం బయటపడిందని దుయ్యబట్టారు. జగన్ను స్వామి వారు వదిలేసినా.. భక్తులు వదిలే ప్రసక్తే లేదన్నారు.