AP: కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు పెళ్లి చేసుకుని పెడన పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఇద్దరిలో వరుడు మైనర్ కాగా వధువు మేజర్ కావడం గమనార్హం. వధువుకు 18 ఏళ్లు నిండగా వరుడికి 19 సంవత్సరాల వయస్సు. దీంతో పోలీసులు ఇరువైపులా పెద్దల్ని పిలిపించి చర్చించారు. కాగా, పెళ్లి విషయంలో 21 సంవత్సరాలు దాటే వరకు యువకుల్ని మైనర్‌గానే పరిగణించాలి.