TG: HYD శివారులో రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేసే ప్రయత్నం చేసిన కేసులో టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను OU పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఈ కేసులో ఈ నెల 17న శివరామకృష్ణను OU పోలీసులు అరెస్టు చేయగా.. 18న బెయిలు వచ్చింది. 19న విడుదలయ్యారు. బెయిలు షరతుల ప్రకారం పోలీస్ స్టేషన్కు హాజరు కావాలనే నిబంధనను ఆయన ఉల్లంఘించడంతో.. పోలీసులు మరోసారి అరెస్టు చేశారు.