KDP: కడప పాత బస్టాండు సమీపంలో మహమ్మద్ గౌస్ అనే యువకుడు బైక్‌పై వెళ్తూ.. పాత బస్టాండు సమీపంలో నిలబడిన ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్లు 1 టౌన్ ఎస్సై అమర్నాథరెడ్డి తెలిపారు. మీడియాలో బైక్ విన్యాసాలు చేసి ఆర్టీసీ బస్సును ఢీకొన్నారని వచ్చిన వార్తలో వాస్తవం లేదన్నారు. మోటారు బైక్ డ్రైవ్ చేసే సమయంలో గౌస్‌కు ఫిట్స్ రావడంతో కంట్రోల్ తప్పి బస్సును ఢీకొన్నాడన్నారు.