సత్యదేవ్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని తెలిపారు. ఇక ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, సునీల్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.