TG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం 22 గేట్లు ఎత్తి దిగువకు 1,77,518 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,08,863 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,25,463 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.7 అడుగులకు చేరింది.